సాధారణంగా నిమ్మరసంతోనో లేదా వేరేదేని పానీయాలను సేవించి దీక్షలకు స్వస్తిపలుకుతున్న సంఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ మరో వింత మార్గంలో దీక్షకు స్వస్తి చెప్పిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సాక్షాత్తు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆ దీక్షకు కేంద్రబిందువు కావడంతో విషయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక అసలు విషయమేమిటంటే... గాంధీ జయంతి రోజున చికెన్ ముట్టుకున్న పాపానికి, ఏడాది కాలం పాటు మాంసాహారాన్ని తిన్నంటూ గత 2007 అక్టోబర్ 3న ఆయన తానుగా విధించుకున్న దీక్షను నారాయణ నేడు (శుక్రవారం) ఉపసంహరించుకున్నారు.
ఇంకా చెప్పాలంటే... నారాయణకు మాంసాహారం అమితమైన ఇష్టం కావడంతో, ఏడాదిపాటు ముట్టనన్న దీక్షకు శుక్రవారం రోజునే స్వస్తి చెప్పినా ఏం పర్వాలేదని చికెన్‌ను ప్రీతిపాత్రంగా లాగించేశారు. ఏడాది క్రితం మీడియా సమక్షంలో చేపట్టిన ఈ దీక్షను, నేడు మీడియా ముందే విరమించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు నారాయణ విందును ఏర్పాటు చేశారు. |