కర్నూలు జిల్లా ఉప్పల పాడులో ప్రకృతి ప్రకోపానికి ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం రెండు చోట్ల పిడుగు పడటంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యు ఓడిలోకి చేరుకున్నారు. జిల్లాలోని అవుకు మండలానికి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ దర్గాను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం... ఏడుగురు భక్తులు వర్షదాటికి ఓ చిట్టుకింద సేద తీరారు. వర్షం ఉరుములు మెరుపులతో కురుస్తుండడంతో చెట్టుకింద కూర్చున్న ఏడుగురు వ్యక్తులు పిడుగుపాటుతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
కాగా.... వీరంతా బనగానపల్లికి చెందిన ఓహెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. అలాగే రామాపురం గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. |