ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఆడపడుచులు అవినీతిపై ఉద్యమించాలి : బాబు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆడపడుచులు అవినీతిపై ఉద్యమించాలి : బాబు
తెలుగింటి ఆడపడుచులు అవినీతి ప్రభుత్వంపై ఉద్యమించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్లో శుక్రవారం ఆయన మహాధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... వంటగ్యాస్‌కు కొత్త కనెక్షన్లు ఇచ్చేది లేదని ఇప్పటి అధికార ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు.

తెదేపా హయాంలో రాష్ట్రంలో కొత్తగా 27 లక్షల వంటగ్యాస్ ‌కనెక్షన్లు ఇప్పించామని బాబు తెలిపారు. ప్రభుత్వం గ్యాస్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తోందని బాబు ఆరోపించారు. ఎవరు ఎక్కువ ముడుపులు చెల్లిస్తే వారికే భూములను ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు.

తమ పాలనలోనే భాగ్యనగరంలో ఐటీ ప్రవేశించిందని బాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సెజ్‌ల పేరుతో పేదల భూములను బాడానాయకులకు ప్రభుత్వం తక్కువ సొమ్ముకు అప్పగిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పించిందో చెప్పాలని బాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తాము మీకోసం అసెంబ్లీలో పోరాడితే మమ్మల్ని సస్పెడ్ చేశారని, అవినీతి ప్రభుత్వానికి అంతం పలుకుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు తెదేపా మహిళా అధ్యక్షురాలు రోజా, నగర మాజీమేయర్ తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ అల్లాడి రాజ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పిడుగు పాటుకు ఎనిమిదిమంది మృతి
తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు : పరకాల
చికెన్‌తో దీక్షకు స్వస్తి చెప్పిన నారాయణ!
ఎరువుల గోదాములపై రైతుల దాడి
బెల్టుషాపులపై సమగ్ర నివేదిక సమర్పించాలి : సీఎం
తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా