ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > 5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్
ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చే ఆదివారం దేశ రాజధానికి వెళ్లనున్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానాంశంగా చేసుకుని చేపట్టే ఈ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో భేటీ కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించడంతో నేత కార్మికుల సమస్యలకు రాజకీయరంగు పులుముకుంది. దీనితో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కారానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ కారణంతోనే సీఎం ఢిల్లీ పయనమవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. ఈ పర్యటనలో పీసీసీ కార్యవర్గం తుది కసరత్తుపై ముఖ్యమంత్రి మరోమారు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆడపడుచులు అవినీతిపై ఉద్యమించాలి : బాబు
పిడుగు పాటుకు ఎనిమిదిమంది మృతి
తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు : పరకాల
చికెన్‌తో దీక్షకు స్వస్తి చెప్పిన నారాయణ!
ఎరువుల గోదాములపై రైతుల దాడి  
బెల్టుషాపులపై సమగ్ర నివేదిక సమర్పించాలి : సీఎం