ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభమైన ఎరువుల కొరత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నేటికి తీరలేదు. అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో అన్నదాతలు ఎరువుల కోసం ఆందోళన చేపడుతున్నారు.

తాజాగా ఎరువుల సమస్యపై శనివారం ఒంగోలులో టీడీపీ మహాధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మాహాధర్నాకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవికుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... ఈ రోజు (శుక్రవారం) తాము ఒంగోలు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. వైఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని ఆయన ఆరోపించారు. రైతాంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందని రవికుమార్ విమర్శించారు.

తొలుత డీజిల్ కొరత, ఇప్పుడు ఎరువులు, విత్తనాల కొరతలతో రైతులు ఎలా పంటలు పండిస్తారని రవికుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. వచ్చిన ఎరువులంతా కాంగ్రెస్ నేతలకే సరిపోతున్నాయని, సామాన్య రైతులకు ఎరువులు ఏ మాత్రం అందడం లేదని ఆయన ఆరోపించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
16న సచివాలయ ముట్టడి యధాతథం: జేఏసీ
రెండు బస్సులు ఢీ : 20మందికి గాయాలు
5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్
ఆడపడుచులు అవినీతిపై ఉద్యమించాలి : బాబు
పిడుగు పాటుకు ఎనిమిదిమంది మృతి
తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు : పరకాల