కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రకటించారు. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీయేతర ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరిస్తామన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు పరిశీలకునిగా ప్రకాష్ కారత్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, ఇతర పార్టీలతో పెట్టుకునే విషయంపై పొత్తులపై కోల్‌కతాలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగే కేంద్ర కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రతిపాదించిన ఫిఫ్టీ-50 ఫార్ములా గురించి ప్రస్తావించగా అలాంటిదేమీ తనదృష్టికి రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, భాజపాలను ఓడించడం లక్ష్యమని ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. |