ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రకాష్ కారత్‌తో అల్లు అరవింద్ భేటీ!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రకాష్ కారత్‌తో అల్లు అరవింద్ భేటీ!
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో శనివారం ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ భేటీ అయ్యారు. పొత్తులు కుదుర్చుకోవడంతో పాటు, పలు రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య వ్యూహాత్మకంగా చర్చలు జరిగింది. కారత్‌తో భేటీ అయిన అనంతరం అల్లు అరవింద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలతో చేతులు కలిపే ప్రసక్తేలేదని చెప్పారు. తమది లౌకిక పార్టీ అని అన్నారు. కారత్ ఇంతవరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తమతో స్పష్టంగా చెప్పారని హరిరామ జోగయ్య ఈ సందర్భంగా తెలిపారు.

ఇకపోతే... ప్రధానంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో కోల్‌కతాలో జరిగే సీపీఎం జాతీయ మహాసభల సమావేశంలోపు పీఆర్పీ పొత్తులు కుదుర్చుకోవడంపై తుది నిర్ణయం తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కోరిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో పీఆర్పీ నేతలు అల్లు అరవింద్, హరిరామ జోగయ్యలు కారత్‌తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రజలకోరిక మేరకే తెలంగాణ : హరికృష్ణ
నేడు పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన
అవినీతి రహిత పాలనే అంతిమ లక్ష్యం: చిరు
పేదల కడుపులు కొడుతున్న ప్రభుత్వాలు: మిత్రా
కృష్ణానదిలో నలుగురు గల్లంతు
తెలంగాణపై తెదేపా పోకడలేమిటో చెప్పాలి: గౌడ్