ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > వటోలీలో పర్యటించిన పీఆర్పీ ప్రతినిధులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వటోలీలో పర్యటించిన పీఆర్పీ ప్రతినిధులు
వటోలీ గ్రామంలో జరిగిన ఘర్షణలకు ఆరుగురు సజీవ దహనం అయిన సంఘటనా స్థలాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకులు అల్లు అరవింద్, పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇక్కడి ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.

ఇలాంటి హింసాత్మక సంఘటనలు రాష్ట్ర మంతటా వ్యాపించకుండా అరికట్టడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని అల్లు అరవింద్ కోరారు. ప్రతిపక్ష పార్టీల్లాగా అధికార ప్రార్టీని మీరు విమర్శించరా... అని ప్రతినిధులడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ అందరిలాగా తాము విమర్శించబోమన్నారు.

ఇకపోతే ఆదిలాబాద్‌ జిల్లా భైంసా, కరీంనగర్‌ పట్టణాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు మత ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెల్సిందే. దీనికి నిదర్శనంగా ఆదివారం భైంసా సమీపంలోని వటోలీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భైంసాలో కోనసాగుతున్న కర్ఫ్యూ
భైంసా ఘటన బాధాకరం : చిరంజీవి
హస్తినాపురికి వెళ్లిన సీఎం
క్షేత్రస్థాయికి వెళుతున్న పీఆర్పీ శ్రేణులు
ప్రజలకే జవాబుదారీగా ఉంటా: చిరంజీవి
అదిలాబాద్‌లో ఆరుగురి సజీవ దహనం