ప్రభుత్వానిక పన్ను ఎగ్గొట్టే అలవాటు తనకు లేదని ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. పన్ను సక్రమంగా కట్టినందుకు ఆదాయపన్ను శాఖ తనకు అవార్డు కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
చిరంజీవి ఆదాయపన్ను సరిగా కట్టడంలేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శించిన నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రజా అంకిత యాత్రలో పాల్గొంటున్న చిరంజీవి మాట్లడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలపై ఘాటుగా స్పందించారు.
తన ఆస్తుల వివరాలు తెరచిన పుస్తకంలాంటిదని దీనిపై ఎవరూ నన్ను తప్పుబట్టే అవకాశం లేదని చిరంజీవి పేర్కొన్నారు. ఆదాయాన్ని సరిగ్గా చూపడంతో పాటు ఆదాయపన్నును సైతం తాను సక్రమంగా కట్టానని చిరంజీవి అన్నారు.
ఆదాయపన్నును సక్రమంగా చెల్లించిన కారణంగా ఆదాయపన్ను శాఖ గతంలో తనకు సమ్మాన్ అవార్డును సైతం ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. |