ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పవన్ పర్యటనకు విశేష స్పందన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పవన్ పర్యటనకు విశేష స్పందన
పీఆర్పీ నేత, మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ రంగారెడ్డి పర్యటనకు విశేష స్పందన లభించింది. ఇంకా.. వికారాబాద్, పరిగి, తాండూరు వంటి తదితర ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన పవన్ ఇబ్రహీం పట్నంలోని పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసి, జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పవన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఓట్ల రాజకీయాలకు పాల్పడే వారికి అభిమానులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చిరంజీవి ఎందుకు రాజకీయాల్లోకి ప్రవేశించారని ప్రశ్నించేవారు... ఎవరినడిగి రాజకీయాల్లోకి వచ్చారని ధీటుగా ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీతోనే సామాజిక న్యాయం చేకూరుతుందని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పన్ను ఎగ్గొట్టే అలవాటు నాకు లేదు : చిరు
కాంగ్రెస్‌ సినీ సందడి : పార్టీలో చేరిన జయసుధ
లాంఛనంగా "ఎయిర్ షో" ప్రారంభం
భూసేకరణ కార్యాలయ ముట్టడి: నారాయణ అరెస్ట్
సీపీఐ ధర్నాకు నిరాకరణ : పోలీసుల మోహరింపు
'మెగా' యాత్రకు 'చిరు' విరామం : పీఆర్పీ