రాష్ట్రంలో అత్యాధునిక పరిశోధన సంస్థలు అలాగే... ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత మరియు రానున్న కాలంలో ప్రాముఖ్యత కలిగిన ఈ-గవర్నెన్స్ లాంటి అంశాలను బోధించడంలో ఇవి ప్రత్యేకత కలిగి ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో విజ్ఞాన సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్న నేటి నవయువ తరం.. పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల రాకతో... వాటికి చరమగీతం పాడనున్నారు.
ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ, గుజరాత్‌లలోను వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జాతీయ విజ్ఞాన కమిషన్ (ఎన్‌కేసీ) సూచనల మేరకు ఆయా రాష్ట్రాలు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళికలో.. సమాజంలో ఆధునిక విజ్ఞాన వ్యాప్తి ఎలా అన్నదే ప్రధానాంశం.
ఈ విషయంపై న్యూఢిల్లీలో ఎన్‌కేసీ ఛైర్మన్ శ్యాం పిట్రోడా మాట్లాడుతూ... దీనికి సంబంధించి సీమా సీఫార్సులను 26 రాష్ట్రాలతో చర్చించగా.. మూడు రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వచ్చాయన్నారు. విజ్ఞాన వ్యాప్తిలో భాగంగానే ఆధునాతన సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా సీమా సిఫార్సులపై చర్చిస్తున్నాయని శ్యాం పేర్కొన్నారు. |