ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రి వర్గ సమావేశం పచ్చజెండా ఊపింది. వాటిల్లో సుమారు 15,584 సెకెండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను స్కూలు అసిస్టెంట్‌లుగా అప్‌గ్రేడ్ చేయనుండగా.. 17,971 స్కూలు అసిస్టెంట్ పోస్టులను, 28,289 సెకెండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను, 2,719 పీఈటీ పోస్టులను, 6,965 లాంగ్వేజ్ పండిట్ పోస్టులను నేరుగా రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.

హైదరాబాదులో మంత్రివర్గ సమావేశానంతరం విలేకరుల సమావేశంలో సమాచారశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ పైవివరాలను వెల్లడించారు. ఇంకా రాష్ట్రంలో కొత్తగా 25 జూనియర్ సివిల్ జడ్జి, 10 సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు.

అలాగే తొమ్మిది జిల్లాల్లో కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేయనుండటంతో పాటు ఎస్టీ విద్యార్థుల కొరకు 50 కాలేజీ హాస్టళ్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆనం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వయోపరిమితిని పెంచే అంశంలో మంత్రివర్గ సమావేశంలో సానుకూలంగా స్పందించినట్లు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

దీంతో ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన గరిష్ట వయోపరిమితిని ఆయా ఉద్యోగాన్ని బట్టి ఎంత మేర సడలించాలనే విషయాన్ని సాధారణ పరిపాలనా శాక నిర్ణయిస్తుందని ఆనం వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయాల ఏర్పాటు
పవన్ పర్యటనకు విశేష స్పందన
పన్ను ఎగ్గొట్టే అలవాటు నాకు లేదు : చిరు
కాంగ్రెస్‌ సినీ సందడి : పార్టీలో చేరిన జయసుధ
లాంఛనంగా "ఎయిర్ షో" ప్రారంభం  
భూసేకరణ కార్యాలయ ముట్టడి: నారాయణ అరెస్ట్