ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > వైఎస్‌వి ఊసరవెల్లి రాజకీయాలు: కేసీఆర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైఎస్‌వి ఊసరవెల్లి రాజకీయాలు: కేసీఆర్
రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డివి ఊసరవెల్లి రాజకీయాలని తెలంగాణా రాష్ట్ర సమితి కె. చంద్రశేఖరరావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణాను దోచుకుతింటున్న వారందరికీ తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తెలంగాణాను నుంచి విడదీయరాదని.. అలా చేసిన పక్షంలో 1969 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని కేసీఆర్ గుర్తు చేశారు.

కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఒక ఎకరాకు కూడా నీళ్లివ్వని వైఎస్.. తెలంగాణాను దోచుకుతింటున్నారని ఆరోపించారు. తెలంగాణా వాదానికి వ్యతిరేకమని ఏ ముస్లిం సోదరుడు అనలేదు. వారిని అడ్డుపెట్టుకుని వైఎస్ కుటిల రాజకీయాలను పన్నుతున్నారని.. రేపు క్రైస్తవులను కూడా ఇందులోకి లాగుతారని పేర్కొన్నారు.

ఎంఐఎంను అడ్డుపెట్టుకుని వైఎస్ చిలిపి చేష్టచేష్టలు చేస్తున్నారని చెప్పిన కేసీఆర్.. తెలంగాణా వాదానికి మద్దతు పలికే ఎవ్వరితోనైనా పొత్తు పెట్టుకుంటామన్నారు. అసుద్దీన్ విడుదల చేసే ప్రతి ప్రకటన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వచ్చినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా
రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయాల ఏర్పాటు
పవన్ పర్యటనకు విశేష స్పందన
పన్ను ఎగ్గొట్టే అలవాటు నాకు లేదు : చిరు
కాంగ్రెస్‌ సినీ సందడి : పార్టీలో చేరిన జయసుధ
లాంఛనంగా "ఎయిర్ షో" ప్రారంభం