|
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గోషామల్‌లో పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పోలీసు అధికారుల త్యాగాలను కొనియాడారు.
పోలీసుల త్యాగాలకు సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. భవిష్యత్‌లో పోలీసులకు గడ్డుకాలం ఎదురుకానుందని సీఎం వెల్లడించారు.
సవాళ్లను ఎదుర్కొనడంలో సమన్వయం, పూర్తి అవగాహనతో పోలీసులు ముందుకు సాగాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర హోంమంత్రి జానారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
|