నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గురువారం ఎర్రజొన్న రైతులు ఆందోళనలకు దిగడంతో పోలీసు శాఖ ముందస్తుగా ఆర్మూరులో 144 సెక్షన్ అమలు చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని రైతులు ఆరోపించారు.
దీనితో... ప్రభుత్వ మందకొండితనాన్ని వ్యతిరేకిస్తూ.. ఎర్రజొన్న రైతులు గురువారం ధర్నా చేపట్టారు. మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. మరోవైపు ఈ ధర్నాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ఆర్మూరులో ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. |