ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > చిరుకి రాజకీయ అవగాహన లేదు : సబిత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరుకి రాజకీయ అవగాహన లేదు : సబిత
ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవికి రాజకీయ అవగాహన లేదని గనులు మరియు భూగర్భశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎవరో రాసిస్తేనే చిరంజీవి ప్రసంగించగలరని, సొంతగా రాజకీయాల గురించి ప్రస్తావించలేరని ఆమె విమర్శించారు.

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పర్యటనలో చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలనే పీఆర్పీ అధికారంలోకి వస్తే చేస్తుందని చెప్పడం చమత్కారంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తమ పార్టీ చేపట్టని కొత్త పథకాలు ఎవైనా ఉంటే చెప్పాల్సిందని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.

చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారించడానికి తమ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోందని ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. నేతన్నలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయాలంటే ప్రజల సంక్షేమాన్ని ఆశించి ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెట్టడమేనని చెప్పారు. కాగా... చిరంజీవి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదని సబితా ఇంద్రారెడ్డి విమర్శనాస్త్రాలు సందించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తెలంగాణ అంశంపై అధిష్టానం పరిశీలన: డీఎస్
అదిలేని తెలంగాణాను ఊహించడమే కష్టం!
అసలు రాజధాని సంగతి ఏమిటో చెప్పండి?
పీఆర్‌పీ, తెదేపాలు బూర్జువా పార్టీలే..!
ప్రజలకు సేవ చేయడమే తెలుసు : మెగాస్టార్
ప్రత్యేక తెలంగాణపై పీఆర్పీ సానుకూల ప్రకటన