ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > అయేషా హత్య కేసులో మేనమామ అరెస్టు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అయేషా హత్య కేసులో మేనమామ అరెస్టు!
ఎట్టకేలకు అయేషా హత్యకేసు పలు మలుపులు తిరిగి ఓ కొలిక్కి వచ్చింది. అయేషా హత్య కేసు పోలీసుల ప్రతిభకు పెనుసవాల్‌గా మారింది. తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన అయేషా హత్యకేసులో యువతి మేనమామ అబీబ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

తాము చేపట్టిన విచారణలో అబిబ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. డబ్బుకోసమే అయేషాను కిడ్నాప్ చేసినట్లు అబీబ్ ఒప్పుకున్నాడు. తనతో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అబీబ్ చెప్పాడని ఆ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం తాము తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసు వర్గాలు చెప్పాయి. అయేషా హత్యకేసుపై పోలీసులు గత కొంతకాలంగా గాలంవేసి వెతుకుతున్న సంగతి తెల్సిందే. గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన యువగర్జన బహిరంగ సభలో అయేషా హత్య విషయాన్ని ప్రస్తావించిన అనంతరం పోలీసులు నిందితుని కనిపెట్టడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మదీనా విమానం రద్దు : యాత్రికుల్లో గందరగోళం
శైలజారెడ్డికి నివేదిక అందించాలి హైకోర్టు ఆదేశం
సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట తెదేపా నిరసన
గెలుపు కోసం కృషి చేయాలి :సీఎం
వాళ్లకు జీతాలివ్వొద్దని చెప్పండి : హైకోర్టులో పిటిషన్
ఇంటిపేరు మారినా ఆమె మా సోదరే : హరికృష్ణ