ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > 14న విశాఖకు కేసీఆర్ కార్ల భారీ ర్యాలీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
14న విశాఖకు కేసీఆర్ కార్ల భారీ ర్యాలీ
ఆంధ్రప్రాంత ప్రజల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకత లేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. దీన్ని చాటిచెప్పేందుకు ఈనెల 14వ తేదీన 500 కార్లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణా భవన్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ కాన్వాయ్ విశాఖపట్నం వరకు సాగుతుంది. ఆ తర్వాత 15న విశాఖలో కోస్తా కారిడార్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాలో కేసీఆర్ పాల్గొని సంఘీభావం ప్రకటిస్తారు.

అనంతరం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై మేధావులు, విద్యావంతులతో ఆయన చర్చలు జరుపుతారు. పిమ్మట 16వ తేదీన భద్రాచలం, సింహాచలం వంటి ప్రసిద్ధ ఆలయాలు సందర్శిస్తారు. ఈ తీర్థయాత్ర కోసం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజల్లోనూ వ్యతిరేకత లేదని చాటిచెప్పేదుకే ఈ కార్ల కాన్వాయ్ నిర్వహిస్తున్నట్టు తెరాస పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పెట్రో పరిశ్రమలు: 15న విపక్షాల మహాధర్నా
కాంగ్రెస్‌కు పుత్తూరు ఎమ్మెల్యే గుడ్‌బై..!
తారలకు డీఎస్ విందు: సీనియర్లతో మంతనాలు
మొద్దుశీను హంతకులను వదిలిపెట్టం: సూరి
టిక్కెట్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్: శివశంకర్
వచ్చే ఎన్నికల్లో యువతకు పట్టం: నాగబాబు