ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > మెగాయాత్రకు 'వివేకా' సంపూర్ణ మద్దతు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెగాయాత్రకు 'వివేకా' సంపూర్ణ మద్దతు
ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి సాగిస్తున్న ప్రజాయాత్రకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం పులివెందులలో ప్రజారాజ్యం పార్టీ నేతలతో సమావేశమై హామీ ఇచ్చారు. ఆయన పీఆర్పీ నేతలైన కోటగిరి విద్యాధర రావు, సి.రామచంద్రలయ్యలతో భేటీ కావడం స్థానిక కాంగ్రెస్ నేతల్లో కలకలం సృష్టించింది.

మెగాస్టార్ చేపట్టిన ప్రజాఅంకిత యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా.. పీఆర్పీ నేతలు పార్టీ నేతలు పులివెందులకు వచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో వారు స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ వివేకా.. స్వయంగా ఆర్ అండ్ బి అతిధి గృహానికి వచ్చి కోటగిరి, రామచంద్రయ్యలతో భేటీ అయ్యారు.

పులివెందులలో ప్రజాఅంకిత యాత్రకు అడ్డంకులు ఎదురవుతాయని కొందరు అనడంలో అర్థంలేదని, ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు. పులివెందుల్లో చిరు పర్యటన సౌకర్యాలకు సంబంధించి స్థానికంగా సమస్యలు ఎదురైన మాట పూర్తిగా సత్యదూరమన్నారు.

పర్యటన ఏర్పాట్లు, సౌకర్యాలకు సంబంధించి స్థానికంగా తామే సంపూర్ణ సహకారాలు అందిస్తామని ప్రజారాజ్యం పార్టీ నేతలకు వైఎస్.వివేకా అభయమిచ్చారు. చిరు పులివెందుల పర్యటనను నీరుగార్చాలని కాంగ్రెస్ స్థానిక నేతలు తమవంతు కృషి చేస్తున్న నేపథ్యంలో.. వైఎస్ వివేకా చేసిన వ్యాఖ్యలతో స్థానిక నేతలు విస్మయానికి గురయ్యారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జీవితాంతం 'సేవకుడి'గా పనిచేస్తా: చిరు
రైతు సంఘాలచే డిసెంబర్ 4న చలో అసెంబ్లీ
అవార్డులిచ్చారు... ఎన్టీఆర్‌ను మరిచారు : నన్నపనేని
రజకులకు ఎస్సీ హోదా : చంద్రబాబు హామీ
తెరాసకు జంబో కార్యవర్గం నియామకం
ఎండమావిగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు