|
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం ఉంది. ఇక్కడ పని చేస్తున్న వైద్యుడు తన ఇష్టరాజ్యంగా నడుచుకుంటున్నాడు. ముఖ్యంగా వృద్ధాప్య ధృవీకరణ సర్టిఫికేట్ల మంజూరులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అర్హులైన వృద్ధులకు సర్టిఫికేట్లను ఇవ్వకుండా ఇష్ట రాజ్యంగా తిప్పుకుంటున్నాడు.
అయితే.. తనకు డబ్బులు ముట్టజెప్పిన వారికి మాత్రం క్షణాల్లో సర్టిఫికేట్‌ను అందజేస్తున్నారు. దీంతో విసిగి పోయిన అర్హులైన వృద్ధులు డాక్టర్‌ను నిలదీశారు. అయినప్పటికీ.. వైద్యుడు మాత్రం ఏమాత్రం వెరవకుండా మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమ్మని వృద్దులను బెదిరించడం గమనార్హం.
|