ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > 'సీమ' ప్రజలకు 'చిరు' క్షమాపణ చెప్పాలి : పీసీసీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'సీమ' ప్రజలకు 'చిరు' క్షమాపణ చెప్పాలి : పీసీసీ
రాయలసీమ చరిత్రను ఫ్యాక్షన్ చరిత్రగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొనడాన్ని పీసీసీ తప్పుబట్టింది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి దిశగా సాగుతున్న రాయలసీమ చరిత్రను వక్రీకరించి చెప్పిన చిరంజీవి ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని పీసీసీ డిమాండ్ చేసింది.

చిరంజీవి తన రాయలసీమ పర్యటన సందర్భంగా చేసిన వివిధ వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి ఎన్. తులసి రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎక్కడా లేనట్టు ఫ్యాక్షన్ అనేది రాయలసీమకే పరిమితం అన్నట్టు చిరంజీవి మాట్లాడడం పట్ల తులసిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాయలసీమ చరిత్రలో గర్వించదగ్గ ఎందరో ప్రముఖులున్నారన్న విషయాన్ని చిరంజీవి గుర్తెరిగి మాట్లాడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా గణాంకాల వివరాల ప్రకారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో హత్యల సంఖ్య తక్కువేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో రాష్ట్రంలోని హత్యల సరాసరి బాగా తగ్గిందని ఆయన అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వృద్ధుల పట్ల ప్రభుత్వ వైద్యుని దురుసుతనం  
సీమ యాత్రకు 'సమరసింహా రెడ్డి' సమాయత్తం
రైతులకు నగదు ప్రోత్సహక బహుమతి: వైఎస్ కానుక  
మెగాయాత్రకు 'వివేకా' సంపూర్ణ మద్దతు
జీవితాంతం 'సేవకుడి'గా పనిచేస్తా: చిరు  
రైతు సంఘాలచే డిసెంబర్ 4న చలో అసెంబ్లీ