ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం : కేసీఆర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం : కేసీఆర్
ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ సమక్షంలో నిజామాబాద్‌కు చెందిన ఎ.ఎస్.పోశెట్టి ఎన్టీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణపై ఢిల్లీ స్థాయిలో స్పష్టత వస్తోందనని అందువల్ల రానున్న ఐదారు రోజుల్లో తనకు ఢిల్లీ నేతలనుంచి పిలుపురావచ్చని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జాతీయస్థాయి ముఖ్యనేత తనకు ఈ విషయాలు చెప్పినట్టుగా కేసీఆర్ పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ తల్చుకుంటే మూడు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాగలదని పేర్కొన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తన లక్ష్యమని మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌తో పొత్తుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
'సీమ' ప్రజలకు 'చిరు' క్షమాపణ చెప్పాలి : పీసీసీ
వృద్ధుల పట్ల ప్రభుత్వ వైద్యుని దురుసుతనం  
సీమ యాత్రకు 'సమరసింహా రెడ్డి' సమాయత్తం
రైతులకు నగదు ప్రోత్సహక బహుమతి: వైఎస్ కానుక  
మెగాయాత్రకు 'వివేకా' సంపూర్ణ మద్దతు
జీవితాంతం 'సేవకుడి'గా పనిచేస్తా: చిరు