ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > అద్వానీ ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం: భాజపా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అద్వానీ ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం: భాజపా
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ చేసిన విస్పష్ట ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలవరంరేపిందని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రాజధానిలో జరిగిన బహిరంగ సభలో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణా రాష్ట్రాన్ని వంద రోజుల్లో ఇచ్చేస్తామని అద్వానీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

అందువల్లే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిలు తెలంగాణాపై విస్తృత ప్రచారం చేస్తున్నారన్నారు. రాజ్యాంగంలోని అధికరణ-3 ప్రకారం పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణా బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఒక్క భాజపా వల్లే సాధ్యమవుతుందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పిఠాపురం దొరబాబు‌కు కాంగ్రెస్ తీర్థం
రాష్ట్రమంతటా పులివెందుల తరహాలో అభివృద్ధి: చిరు
పులివెందులలో 'మెగా'షోకు పోటెత్తిన జనం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రరాపా శ్రేణుల 'గాంధీగిరి'
చూపంతా అటు వైపే : సీఎం ఊరిలో నేడు 'చిరు' సందడి
కాంగ్రెస్ ఓటమి కోసం ఛాటింగ్ చేయండి : బాబు