ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పథకం ప్రకారమే వటోలీ మారణకాండ : కమిషన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పథకం ప్రకారమే వటోలీ మారణకాండ : కమిషన్
వటోలీలో అక్టోబర్ 11న పథకం ప్రకారమే ముస్లీం కుటుంబాన్ని అగంతకులు దగ్ధం చేశారని జాతీయ మైనారిటీ కమిషన్ పేర్కొంది. మతతత్వ శక్తులే ఈ ముస్లీం కుటుంబాన్ని బలి తీసుకుని ఉంటాయని ఈ సందర్భంగా మైనారిటీ కమిషన్ అనుమానం వ్యక్తం చేసింది.

వటోలీ మారణకాండపై దర్యాప్తు జరిపిన మొహమ్మద్ షఫీ ఖురేషీ అధ్యక్షతన గల కమిషన్ తన నివేదికను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. వటోలీలో ఇంటితో సహా దహనం కాబడిన ఆరుగురు ముస్లీం కుటీంబీకులను ముందుగానే చంపి అటుపై ఇంట్లో వేసి తగులబెట్టి ఉంటారని కమిషన్ తన నివేదికలో అనుమానం వ్యక్తం చేసింది.

తగులబడిన ఇంట్లో మృతులు ఉన్న గది ఆరుగురు పట్టేంత విశాలంగా లేదని అందుకే తాము పై విధంగా అనుమానిస్తున్నామని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ నివేదిక కోరడం ఆహ్వానించదగ్గ పరిణామమని కమిషన్ అభిప్రాయపడింది.

ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ముస్లీంల సంఖ్య ఎక్కువగా ఉన్నా గ్రామాల్లో వీరి సంఖ్య తక్కువని కమిషన్ తెలిపింది. ఈ కారణంగానే మత ఘర్షణల సమయంలో గ్రామాల్లోని ముస్లీంలే ఎక్కువగా నష్టపోతున్నారని కమిషన్ అభిప్రాయపడింది.

కొద్దిరోజుల క్రితం దసరా ఉత్సావాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసాలో రెండు మత వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. చిన్నగా తలెత్తిన ఘర్షణలు ఉధృతం కావడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో భైంసా దగ్గర్లోని వటోలీ గ్రామంలో నివశిస్తున్న మహబూబ్ ఖాన్ అనే దర్జీ కుటుంబాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకుని మారణకాండకు తెగబడ్డారు.

ఈ ఘటనలో మహబూబ్ ఖాన్‌తో సహా అతని ఐదుగురు కుటుంబ సభ్యులను దుండగులు వారి ఇంట్లోనే బంధించి సజీవదహనం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చేవెళ్ళ ప్రాజెక్టుతో 16.4 లక్షల ఎకరాలకు నీరు: వైఎస్  
అద్వానీ ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం: భాజపా
పిఠాపురం దొరబాబు‌కు కాంగ్రెస్ తీర్థం
రాష్ట్రమంతటా పులివెందుల తరహాలో అభివృద్ధి: చిరు
పులివెందులలో 'మెగా'షోకు పోటెత్తిన జనం  
రాష్ట్ర వ్యాప్తంగా ప్రరాపా శ్రేణుల 'గాంధీగిరి'