ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాం: ధర్మపురి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాం: ధర్మపురి
వచ్చే ఎన్నికల కోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా తెలంగాణా రాష్ట్ర సమితికి ఆహ్వానం పలికినట్టుగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టుకోవాలంటే ముందుగా స్థానికులు అనుమతి తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.

దీన్ని అతిక్రమించిన వారు చట్టానికి బాధ్యులని అన్నారు. ఇతరుల ఫోన్లు, ఫ్యాక్స్‌లను దొంగతనంగా ట్యాప్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. టిక్కెట్లు అమ్ముకున్నట్టు వస్తున్న ఆరోపణలకు ఆయన స్పందిస్తూ అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణపై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నది కూడా హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. అలాగే పొత్తుల కోసం వచ్చే వారికి తమ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కనుచూపు మేరలోనే ప్రత్యేక తెలంగాణ : కేసీఆర్
తెలంగాణపై నిర్ణయం చెప్పక తప్పదు : డీఎస్
పథకం ప్రకారమే వటోలీ మారణకాండ : కమిషన్
చేవెళ్ళ ప్రాజెక్టుతో 16.4 లక్షల ఎకరాలకు నీరు: వైఎస్  
అద్వానీ ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం: భాజపా
పిఠాపురం దొరబాబు‌కు కాంగ్రెస్ తీర్థం