ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > చిరంజీవి కడప యాత్రలో అపశృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరంజీవి కడప యాత్రలో అపశృతి
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కడప జిల్లాలో చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో అపశృతి దొర్లింది. గురువారం మైదుకూరులో చిరు నిర్వహించిన రోడ్‌షో సందర్భంగా ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

రోడ్‌షో నిర్వహిస్తున్న తమ అభిమాన నటుడు మెగాస్టార్‌కు కరచాలనం చేయాలనే ఆతృతతో పలువురు అభిమానులు విద్యుత్ స్తంభాలు, బహుళ అంతస్తులపైకి ఎక్కారు. ఇలా భవనాలపైకి ఎక్కిన అభిమానుల మధ్య తోపులాట జరిగింది.

అపుడు పలువురు అభిమానులు విద్యుత్ వైర్లపై పడిపోయారు. దీంతో కరెంట్ షాక్‌కు గురయ్యారు. అలాగే.. చేపాడు గ్రామంలో చిరు రోడ్‌షో కోసం కటౌట్లను, ఫ్లెక్సీ బ్యానర్లను కడుతున్న మరో అభిమాని అదుపుతప్పి కింద పడిపోవడంతో మృతి చెందాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కేంద్ర ఈసీకి ప్రజారాజ్యం నేతల ఫిర్యాదు
పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాం: ధర్మపురి
కనుచూపు మేరలోనే ప్రత్యేక తెలంగాణ : కేసీఆర్
తెలంగాణపై నిర్ణయం చెప్పక తప్పదు : డీఎస్
పథకం ప్రకారమే వటోలీ మారణకాండ : కమిషన్
చేవెళ్ళ ప్రాజెక్టుతో 16.4 లక్షల ఎకరాలకు నీరు: వైఎస్