ప్రత్యేక తెలంగాణ అంశంలో తమతో చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణపై అధిష్టానంలో చర్చ జరుగుతున్నా ఆరు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే దీనిపై మరింత స్పష్టమైన సంకేతాలు వెలువడనున్నాయని ఆయన తెలిపారు.
ఈ విషయమై ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ పార్టీ నేతలకే తెలియకుండా తెలంగాణపై నిర్ణయం జరిగిపోతోందని వస్తోన్న వార్తలను ఖండించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షడు, తమని సంప్రదిచకుండా హైకమాండ్ నిర్ణయం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు.
విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు వీహెచ్ సమాధానం చెబుతూ తెలంగాణ వచ్చేస్తోందంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడబోనని అన్నారు. కేవలం కేసీఆర్‌తో సంప్రదించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసేసుకోదని కూడా ఆయన పేర్కొన్నారు. |