ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > లబ్ధిదారులపై కనికరం చూపని అధికారులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లబ్ధిదారులపై కనికరం చూపని అధికారులు
రాష్ట్రంలో ఇళ్ళ స్థలంలేని పేదలకు స్థలాలను పంపిణీ అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ సర్కారు గొప్పగా చెపుతోంది. అయితే అధికారులు మాత్రం అందుకు సంబంధించిన కనీస చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదు. ఇందుకు ఉదాహరణలు పలు చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఆరు వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేశారు. వీరికి ఇళ్ళ స్థలాలను అందజేసేందుకు తొలుత హడావుడి చేశారు.

అదేవిధంగా రామాయంపేటలో కూడా ఇదే తరహాలో రెండు వేల పైచిలుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో కేవలం ఆరుగురికి మాత్రం ఇళ్ళ స్థలాలను అందజేశారు. అర్హులైన మరికొంత మంది లబ్ధిదారులు ఇళ్ళ స్థలాల కోసం అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అధికారగణం మాత్రం కనికరం చూపడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూత ఎన్నోసార్లు తిరిగినా అధికారులు మాత్రం లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదని పలువురు వాపోతున్నారు.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మెగాస్టార్ రెండో రోజు పర్యటన సక్సెస్  
కాంగ్రెస్ మాయలో పడొద్దు: తెరాసకు ఇంద్రసేన విజ్ఞప్తి  
కడప దర్గాలో మెగాస్టార్ ప్రత్యేక ప్రార్థనలు  
రేపటి నుంచి కేసీఆర్ 'బస్సుయాత్ర'
వామపక్ష నేతలతో భేటీ కానున్న చంద్రబాబు
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు డౌటే : నరేంద్ర