ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి నాలుగో విడత పర్యటన ఖరారైంది. ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో సాగుతుంది. అయితే.. పార్టీ వర్గాలు మాత్రం ఈ యాత్రా తేదీలను మాత్రం పార్టీ వర్గాలు ధృవీకరించలేదు. అయినప్పటికీ ఆ జిల్లాలలో ఇప్పటి నుంచే అభిమానులు, కార్యకర్తల హడావుడి ఆరంభమైంది. ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన తరువాత తొలి విడతగా చిరంజీవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పర్యటించడం తెలిసిందే.
ఆ తర్వాత మలివిడతగా తెలంగాణ జిల్లాలలోని కరీంనగర్, నల్లగొండ, ఖమ్మంలో పర్యటించారు. ప్రస్తుతం చేపట్టిన రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాల పర్యటన ముగియనుంది. చిరు పర్యటనలలో అంతకంతకూ ప్రజా ప్రతిస్పందన పెరుగుతోంది. ఇదే ఊపును కొనసాగించాలని పీఆర్పీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. అందులోభాగంగా చిరంజీవి నాలుగో విడత ప్రచారాన్ని ఈనెలాఖరులో ప్రారంభించాలని పీఆర్పీ అధిష్టానం భావిస్తోంది. |