ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఈనెల 29 నుంచి బాలయ్య రాష్ట్ర పర్యటనలు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఈనెల 29 నుంచి బాలయ్య రాష్ట్ర పర్యటనలు!
FileFILE
నందమూరి హీరో బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం తన చిత్ర షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న ఆయన త్వరలోనే రాష్ట్రానికి చేరుకోనున్నారు. రాష్ట్రానికి వచ్చీరాగానే.. తన రాజకీయ పర్యటన ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టాయి. ఈనెల 29వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌, గద్వాల, మక్తల్‌లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలకు బాలయ్య హాజరు కానున్నారు.

అక్కడ నుంచే ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు దశలవారీగా శ్రీకారం చుట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి. గుంటూరులో నిర్వహించిన యువగర్జన విజయవంతమైన నేపథ్యంలో బాలయ్య తొలి పర్యటనకు కూడా మంచి స్పందన వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తదనుగుణంగానే బాలయ్య పర్యటన ఏర్పాట్లను తెదేపా అధిష్టానం, కార్యకర్తలు చేస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రభుత్వ ప్రోద్భలంతోనే 'చిరు'పై కేసు : పీఆర్‌పీ
భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే : చంద్రబాబు
ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం తప్పదు : రోశయ్య
29 నుంచి చిరు నాలుగో విడత యాత్ర
లబ్ధిదారులపై కనికరం చూపని అధికారులు  
మెగాస్టార్ రెండో రోజు పర్యటన సక్సెస్