నవంబర్ నెలలో మక్కాయాత్రకు బయలుదేరిన ముస్లింలు హజ్ తీర్థయాత్ర ముగించుకుని సోమవారం ఉదయాత్పూర్వం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరికి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్ అలీ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వాలు హజ్ యాత్రికులకు ఏ లోటూ రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాయని, మొదటి విడతగా 298 మంది ముస్లింలు ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకున్నారని తెలిపారు. |