హైదరాబాద్‌లోని భీమ్‌రావ్ బాడ కూల్చివేత చట్ట ప్రకారమే జరిగిందని రాష్ట్ర హోం మంత్రి కె.జానారెడ్డి సమర్థించుకున్నారు. నాంపల్లికి సమీపంలోని భీమ్‌రావ్ బాడను పోలీసుల సహకారంతో అధికారులు శనివారం తెల్లవారు జామునుంచి కూల్చి వేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజధానిని కుదిపేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలంతా అక్కడకు చేరుకుని బాధితులకు అండగా నిలబడ్డారు.
దీనిపై హోంమంత్రి జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమ్‌రావ్ బాడా వాసులకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. ఇక్కడ ఉన్న వారిని జియాగూడలోని ధోబీఘాట్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని ఇళ్లను ప్రజాభీష్టం మేరకు జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే బాధిత ప్రాంతంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, గాంధీ భవన్ విస్తరణ చర్యల్లో భాగంగా ఈ ఇళ్లను కూలగొట్టారు. |