రాజకీయ పార్టీల నిర్వహించే రోడ్‌షోలపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను తొలగించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. స్టే తొలగించినప్పటికీ నిబంధనలకు లోబడి వీటిని నిర్వహించాలని హైకోర్టు పేర్కొనడం పట్ల పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు డిజిపి సమర్పించిన మార్గదర్శకాల మేరకు రోడ్‌షోలను నిర్వహించడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ నేతలు మాత్రం కోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఇంకా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఈ పరిస్థితుల్లో డిజిపి కోర్టుకు సమర్పించిన నివేదికలో ఉన్న నిబంధనలను ఒకసారి పరిశీలిస్తే..
* రాష్ట్ర ప్రధాన పట్టణ రహదారుల్లో ర్యాలీలు, రోడ్‌షోలు అనుమతించరు. * రోడ్‌షోలలో మైకుల్లో మాట్లాడ కూడదు. * నిషేధించిన రోడ్లలో రోడ్డుకు ఇరువైపులా జన సమీకరణ చేయరాదు. * పార్టీ కాన్వాయ్‌లో పది వాహనాలకు మించి ఉండకూడదు. * ముఖ్యంగా.. రోడ్‌షోలు జన సంచారం, ట్రాఫిక్ లేని రహదారుల్లో మాత్రమే నిర్వహించాలి. * ఈ షోలు జరిగే చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆయా రాజకీయ పార్టీల నేతలో చూసుకోవాలి. * రోడ్‌షోకు హాజరయ్యే జనాన్ని ముందుస్తుగా ఊహించి స్థానిక పోలీసు స్టేషన్‌కు తెలుపాలి. |