ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రజారాజ్యం అధినేతను కలిసిన శత్రుఘ్నసిన్హా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజారాజ్యం అధినేతను కలిసిన శత్రుఘ్నసిన్హా
FileFILE
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. భాజపా-ప్రరాపాల మధ్య పొత్తు పెట్టుకునే అంశంపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం భాజాపా రాష్ట్రంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది.

అయితే.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాత్రం ఆ పార్టీతో చేతులు కలిపేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రరాపాలో పొత్తుపెట్టుకోవాలని కమలనాథులు ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ ప్రరాపా నేతలు మాత్రం భాజపాతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేస్తున్నారు. అయితే భాజపా నేతలు ప్రరాపా నేతలతో తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా బుధవారం చిరంజీవి-శత్రుఘ్నసిన్హాలు భేటీకి అత్యంత ప్రాధాన్యత సమకూరింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి: పవన్ కళ్యాణ్
యాసిడ్ దాడి: బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతి
నిబంధనల లోబడి రోడ్‌షోలు అసాధ్యం
బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పునర్విచారణ!!
మరింత విషమించిన స్వప్నిక ఆరోగ్య పరిస్థితి
రాజకీయ పార్టీలకు ఊరట: రోడ్‌షోలపై స్టే ఎత్తివేత