నూతనసంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలతోబాటు చిన్నచిన్న దేవాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇవేకాక రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో కూడా సందడి నెలకొంది. ఈ సారి ప్రభుత్వ సెలవులు కలిసిరాక పోవడంతో ప్రజలు స్థానికంగావున్న ఆలయాలలో దర్శనాలకై క్యూలు కడుతున్నారు. ఈ సందర్భంగా అన్ని దేవాలయాలలో ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రముఖ దేవాలయాలవద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లనుకూడా చేపట్టారు
ప్రముఖంగా తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగానేవుంది. నూతన సంవత్సరంతోబాటు ఈ రోజు గురువారం కావడంతో షిర్డీ సాయిబాబా భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో బాబా భక్తులు వేకువజాము నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మద్యాహ్నానికి అన్నదాన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యువకులైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేరింతలతో తమ ప్రాంతాలన్నీ కలియ తిరుగుతున్నారు. |