రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయనీ, ఈ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీకీ ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. దీంతో రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కన్న కలలు కల్లలౌతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రులు మారెప్ప, మాగంటి బాబులచేత రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులచేత ఎందుకు రాజీనామా చేయంచలేదని ఆయన ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వ అవినీతి, భూకబ్జాలను ప్రధాన అంశాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళతామని దత్తాత్రేయ తెలిపారు. |