ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > దేశద్రోహి కాక చిరు దేశ భక్తుడా? : మంత్రి పొన్నాల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశద్రోహి కాక చిరు దేశ భక్తుడా? : మంత్రి పొన్నాల
భారతదేశంలో జీవిస్తూ, ఇక్కడి స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ బ్రిటీష్ పాలనను గొప్పదిగా అభివర్ణించిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దేశద్రోహి అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆదివారం వరంగల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవిపై నిప్పులు చెరిగారు.

భారతదేశాన్ని బానిస సంకెళ్లతో బంధించిన బ్రిటీష్ వారి పాలన గొప్పదిగా అభివర్ణించిన చిరంజీవి దేశద్రోహి కాక దేశభక్తుడు అవుతాడా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. అబద్ధాలతో పార్టీని నడిపే చిరంజీవి తక్షణం రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమాత్రం రాజకీయ అవగాహన లేని చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్ పాలకులను విమర్శిస్తున్న ప్రజారాజ్యం పార్టీ నేతలకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన కంటే బ్రిటీష్ వారి పాలనే నయమని చిరంజీవి అని శనివారం చేసిన వ్యాఖ్యలకు పొన్నాల నేడు ప్రతిస్పందించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన చిరు పర్యటన
కాంగ్రెస్‌కు వంద రోజుల్లో మరణశాసనం: బాబు
ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింది...దత్తాత్రేయ
కాంగ్రెస్‌కు షాకిచ్చిన జడ్పీటీసీ ఫలితాలు
మంత్రుల రాజీనామా.. ఆమోదమే తరువాయి
అంతర్రాష్ట్ర దొంగలు ఎన్‌కౌంటర్‌లో మృతి