ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వెల్లడించారు. అందువల్ల ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను తక్షణం పూర్తి చేయాలని ఆయన అధికారులను అదేశించారు. పనుల పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం జాప్యం చేసిన పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రివర్గ సహచరులకు సూచించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీ శ్రేణులు కుంగిపోవాల్సిన అవసరం లేదని వైఎస్ కేబినెట్ భేటీలో అన్నట్టు సమచారం. అయితే మంత్రులు మూలింటి మారెప్ప, మాగంటి బాబుల రాజీనామాలు పార్టీ శ్రేణులను హెచ్చరించడానికేనని ముఖ్యమంత్రి వైఎస్ వ్యాఖ్యానించారు. మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్నందున పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పిలుపునిచ్చారు. |