ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కాంగ్రెస్-తెదేపా హామీల్లో విశ్వసనీయత ఎంత?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్-తెదేపా హామీల్లో విశ్వసనీయత ఎంత?
FileFILE
అధికారం కోసం రాజకీయ పార్టీల నేతలు ఎంతటి అకృత్యానికైనా ఒడిగట్టేందుకు వెనుకంజ వేయరు. అవసరమైతే తమ వెంట ఉన్న వాడిని బలిపశువును చేస్తారు. తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసిన మరుక్షణమే అలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తారు. ఇలాంటి కుయుక్తుల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నేతలు ఆరితేరారు.

సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనాన్ని తట్టుకునేందుకు ఆది నుంచి మాటల యుద్ధం ప్రారంభించారు. దీంతో పీఆర్పీ నేతలు సైతం అదే పంథాను అనుసరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనలో ఉన్న చిరంజీవి.. తమ పార్టీ అనుసరించబోయే భవిష్యత్ విధి విధానాల్లో ఒక్కదాన్ని ప్రకటించారు.

ఇందులో తొలుత ప్రకటించిందే.. 'వందకే వంట సరకు' అనే నినాదం. దీంతో ఖంగుతిన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అపుడే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎలాంటి అనుభం లేని చిరంజీవి.. ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు బాగానే వుంది. అయితే.. కాంగ్రెస్, తెదేపాలు ఇచ్చే హామీలు మాత్రం ఎలా నెరవేర్చుతారు. వారివద్ద ఏమైనా మంత్రదండాలు ఉన్నాయా? లేక వారు మంత్ర విద్యలేమైనా నేర్చుకున్నారా? అని పీఆర్పీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే అన్నింటిని ఉచితంగానే పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. ఇదెలా సాధ్యం. తెలివి తేటలు, ఆచరణ మార్గాలు కేవలం ఆయనకు మాత్రమే సొంతమా.? చిరు హామీని ప్రజలు విశ్వసించే అవకాశాలు లేవని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. నిజమే.. తొమ్మిదేళ్ళ అధికారంలో ఉన్న చంద్రబాబుకు అపుడు గుర్తుకు రాలేదా ఫ్రీ రాయితీలు?

నిజమే మరి.. అన్నీ ఉచితంగా ఇస్తామనే వారినే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే.. 'ఆల్ ఫ్రీ బాబు'గా పేరు గడించిన చంద్రబాబు మాటల్లో ఎంత విశ్వసనీయత ఉందో ప్రజలకు తెలుసు కాబట్టి. ఇకపోతే.. 123 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.

అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల కుయుక్తులను పన్నుతోంది. ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తోంది. అధికార పగ్గాలు చేపట్టగానే ప్రజలను విస్మరించే తెదేపా, కాంగ్రెస్ నేతలు, తమకు వ్యతిరేకంగా మూడో వ్యక్తి రావడాన్ని సహించలేక దుష్ప్రచారం చేస్తున్నాయన్నది పీఆర్పీ నేతల వాదన.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రోడ్‌ షోలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
"సత్యం"పై సీబీసీఐడీ విచారణ : వైఎస్సార్
తెరాసాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదా?
ఫలించని పొత్తులు... ఒంటరి సమరమే: చిరు
లారీల సమ్మె... స్థంభించిన నిత్యావసర సరుకుల రవాణా
ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో ప్రారంభం