ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > విద్యార్థిని గొంతు కోసిన సహ విద్యార్థి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విద్యార్థిని గొంతు కోసిన సహ విద్యార్థి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ యాసిడ్ దాడి సంఘటనను మరచిపోకముందే ఒంగోలు జిల్లాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. ఒక విద్యార్థి సాటి విద్యార్థిని గొంతు కోశాడు. అనంతరం కళాశాల భవనంపై నుంచి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిచింది.

ఒంగోలు జిల్లా సింగరాయకొండలోని మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై సహా విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న స్రవంతి అనే విద్యార్థిని సహ విద్యార్థి హిమవత్ కుమార్ ప్రేమ పేరుతో గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు.

దీనికి నిరాకరించిన స్రవంతిని ఏవిధంగానైనా తనదానిని చేసుకోవాలనే లక్ష్యంతో సహ విద్యార్థి ప్రయత్నించాడు. అవేమీ ఫలించక పోవడంతో స్రవంతి గొంతు కోశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్రవంతిని కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రేమ ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఉగ్రవాదం పోరులో రాష్ట్రం ముందంజ: తివారీ
సుదర్శన్ లేఖ కాంగ్రెస్ సృష్టే: రాఘవులు
అసరమైతే కేసీఆర్‌పై తిరుగుబాటు: సుదర్శన్ లేఖ
21 నుంచి భాజపా సంకల్ప యాత్ర
ప్రజలను మభ్యపెడుతున్న వైఎస్: బాబు