చాలా ఏళ్లుగా పనిచేస్తున్న తమతోనే శాఖలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధను ముట్టడించారు.
ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ విద్యుత్ సౌధలో అమలు చేస్తున్న వెయిటేజీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యుత్ సౌధలో ఖాళీ అవుతున్న పోస్టులను పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారితోనే భర్తీ చేసి తీరాలంటూ వారు డిమాండు చేశారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కార్మికులు వందలాదిగా వచ్చి రోడ్డుపై బైటాయించి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారినందరినీ అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. |