ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > నా రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు: నటి కవిత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నా రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు: నటి కవిత
తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెదేపా మహిళా నేత, సినీ నటి కవిత ఆరోపించారు. తన ఇంట్లో పని చేసే పని మనుషులను ఎవరినీ తాను ఏనాడూ చులకనభావంతో చూడలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఇంట్లో పని చేస్తున్న బాలికలను హింసిస్తూ వారిని వేధింపులకు గురి చేసిందన్న ఆరోపణలపై కవితపై ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన విషయం తెల్సిందే.

దీనిపై కవిత స్పందిస్తూ తాను ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరానని, తన రాజకీయ ప్రవేశాన్ని నిరోధించేందుకే కొందరు ఇలాంటి కుట్ర పన్నారని ఆరోపించారు. తన ఇంటిలో పని చేసిన బాలికల పట్ల తానుగాని, తన అనుచరురులుగానీ, కుటుంబసభ్యులుగానీ ఏనాడూ అనుచితంగా ప్రవర్తించలేదని మంగళవారం ఒక ప్రకటనలో కవిత వివరించారు.

అయితే నమోదైన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆమె తెలిపారు. తనపై బనాయించిన కేసులో పోలీసులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి తనకు న్యాయం చేయవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మార్షల్స్ తోపులాట
దామాషా పద్దతిలో సీట్ల కేటాయింపు: చిరంజీవి
ప్రతిపక్ష సభ్యుల ఒక రోజు సస్పెన్షన్
నారా కోడూరులో పీఆర్పీ, టీడీపీ వర్గాల ఘర్షణ
తిరుమలవాసునికీ తప్పని బెదిరింపులు
కాంట్రాక్టు కార్మికులచే విద్యుత్‌సౌధ ముట్టడి