ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > జగన్ సంస్థలపై ఎస్ఎఫ్ఐవో విచారణ: తెదేపా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జగన్ సంస్థలపై ఎస్ఎఫ్ఐవో విచారణ: తెదేపా
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ నిర్వహిస్తున్న సంస్థల్లో పలు ఆర్థిక కుంభకోణాలు జరుగుతున్నాయని దీనిపై విచారణ జరిపించాలని తీవ్ర ఆర్థిక నేరాల కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో)ను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ మేరకు ఎర్రన్నాయుడు, మైసూరారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ తదితరులతో కూడిన తెదేపా నేతల బృందం ఎస్ఎఫ్ఐవో డైరెక్టర్ అజయ్‌నాథ్‌ను కలిసి విజ్ఞప్తి పత్రాన్ని అందజేసింది.

జగన్ సంస్థల్లో జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకుంటే దేశీయ కార్పొరేట్ రంగం ప్రమాదంలో పడడం ఖాయమని తెదేపా నేతలు ఈ సందర్భంగా అజయ్‌నాథ్‌కు విన్నవించారు. అలాగే వారు మాట్లాడుతూ వైఎస్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బడా సంస్థలకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా అందిచారని ఆరోపించారు.

వైఎస్ తనకు అనుకూలురైన వారికి సెజ్‌లు, సాగునీటి క్రాంట్రాక్టులు కట్టబెట్టి వారిచ్చిన లంచాలను కుమారుని కంపెనీలకు తరలించారని పేర్కొన్నారు. వైఎస్ వల్ల లబ్ధి పొందిన కంపెనీలు ఎక్కువ మొత్తంలో ఆయన కుమారుని కంపెనీల్లో సొమ్మును పెట్టుబడి పెడుతున్నాయని వారు ఆరోపించారు.

దీంతోపాటు జగన్ కంపెనీల్లోని అవకతవకలను గురించి వివరించే 18 పేజీల ఫిర్యాదు పత్రాన్ని, "రాజా ఆఫ్ కరప్షన్" పుస్తకాన్ని తెదేపా నేతలు అజయ్‌నాథ్‌కు అందజేశారు. వీటిపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెదేపా నేతలు అజయ్‌నాథ్‌ను కోరారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తెదేపాతో సీపీఎం దోస్తీపై చిరు విమర్శలు
ఓసీ విద్యార్ధులకూ ఫీజు రాయితీ: వైఎస్ తాయిలం
వైఎస్ అధికార దుర్వినియోగం: సీపీఐ ధ్వజం
మాజీ నక్సల్స్‌పై కేసుల ఎత్తివేతకు హామీ: పవన్
కోస్తా-రాయలసీమల్లో కాంగ్రెస్‌కు పట్టం: వైఎస్
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సినీ నటి శారద