ఎన్నికల నియమావళి అమలు అవుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుబ్బారావు గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ చర్చల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిని ఏమాత్రం ఉపేక్షించరాదని ఆయన ఈ సందర్భంగా కలెక్టర్లకు, ఎస్పీలను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే తీసుకోవలసిన చర్యలను సుబ్బారావు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు వివరించారు.
కాగా, రానున్న ఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎవరి వద్ద నుంచి అయిన ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు చేపడతామని ఎన్నికల నిఘా వేదిక వెల్లడించింది. నేరుగా, ఫోన్ లేదా ఇమెయిల్ తదితరాల ద్వారా ఫిర్యాదులను తమకు చేరవేస్తే చాలునని తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతుండటంతో ఎన్నికల నియమావళిని కఠినతరంగా అమలు చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. |