సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక శక్తులు, వ్యక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజాగాయకుడు గద్దర్ విజ్ఞప్తి చేశారు. ఇలా చేసిన పక్షంలో సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణా వాదం మరిత బలోపేతం అవుతందని పలువురు అభిప్రాయపడుతున్నారని గద్దర్ వ్యాఖ్యానించారు. ‘సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం - ఎన్నికలు’ అనే అంశంపై గురువారం జరిగిన రహస్య సమావేశానికి ప్రజాగాయకుడు గద్దర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా పని చేస్తున్నందున ఆ వాదం బలపడాలన్నా, నిలబడాలన్నా ప్రజారాజ్యం పార్టీలో నిజమైన సామాజిక శక్తులకు స్థానం కల్పించాలని వారు కోరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చిరంజీవికి తెలియజేసే బాధ్యతను ప్రజాగాయకుడు గద్దర్‌కు అప్పగించగా ఆయన గురువారం సాయంత్రం చిరంజీవి, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్‌లను కలిసి ఈ సదస్సులో చర్చించిన విషయాలు, తీర్మానాలను అందజేశారు. అంతకు ముందు జరిగిన సదస్సులో ఎన్‌టీపీ నేతలు కటకం నర్సింగరావు, రాజారాం యాదవ్, గంగాధర్, చలకాని వెంకన్న యాదవ్, మరికొందరు పాల్గొని ప్రసంగించారు. |