ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రాజు కుటుంబాన్ని ఆదుకుంటాం : డీఎస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజు కుటుంబాన్ని ఆదుకుంటాం : డీఎస్
FILE
గాంధీ భవన్ సంఘటనలో మృతి చెందిన ఎస్పీవో సుబ్రహ్మణ్య రాజు కుటుంబాన్ని పార్టీపరంగానూ, ప్రభుత్వపరంగానూ.. అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హామీనిచ్చారు. శనివారం సుబ్రహ్మణ్య రాజు మృతికి డీఎస్, కేవీపీ శ్రద్ధాంజలి ఘటించిన సందర్భంగా పై విధంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే... రాజు కుటుంబానికి ఎమ్మార్పీయస్ ప్రకటించిన ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది. తామే మందకృష్ణకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామనీ, తమ తండ్రిని తమకు తెచ్చివ్వమని సుబ్రహ్మణ్య రాజు కుమార్తె రమ్యశ్రీ ప్రశ్నించింది.

కాగా, సుబ్రహ్మణ్య రాజు కుమార్తెలకు ఇంజనీరింగ్ వరకూ ఉచిత కార్పొరేట్ విద్యను అందించేందుకు మాజీ సైనికోద్యోగి చిరంజీవి రెడ్డి ముందుకు వచ్చారు. రాజు కుమార్తెలు బాగా చదువుకుని పైకి వచ్చేందుకు తన చేతనైన సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తెరాస అధినేతతో మందకృష్ణ భేటి
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎస్వీ సుబ్బారెడ్డి
మేమొస్తే వంద రోజుల్లో తెలంగాణ: బీజేపీ
ఎన్‌‌సిపి గుర్తుపై పోటీ చేయం: చిరంజీవి
టీడీపీతోనే ప్రజలకు మేలు జరుగుతుంది: బాబు
యూపీఏతో మహిళలకు ఒరిగిందేంలేదు: సుష్మా