ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కాంగ్రెస్‌లో చేరిన తెదేపా నేత గుత్తా సుఖేధర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్‌లో చేరిన తెదేపా నేత గుత్తా సుఖేధర్
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, నల్గొండ జిల్లా సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ డి.శ్రీనివాస్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా తెదేపాలో పని చేసిన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం విశేషం.

సుఖేదర్ రెడ్డికి తెదేపా అధినేతకు మధ్య నల్గొండ పార్లమెంట్ నియోజవర్గ అభ్యర్ధిత్వంపై భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. రెండు దశాబ్దాలకు పైగా తెదేపాలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన తాను పార్టీకి రాజీనామా చేసినట్టు గుత్తా వివరించారు.

మహాకూటమి పొత్తుల్లో భాగంగా వామపక్షాలు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయబోమని చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు నల్గొండ ఎంపి సీటు వారికే కేటాయించారని ఆయన తెలిపారు. నల్గొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే హమీపైనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రైతులకు పావలా వడ్డీకే రుణాలు: చంద్రబాబు
ప్రజలను విరాళాలర్థిస్తున్న రాజకీయ పార్టీలు
16 నుంచి చిరంజీవి కృష్ణా జిల్లా పర్యటన
మార్చి 16నుంచి ఒంటిపూట తరగతులు
టీవీలు ఉన్నవారికేనా.. పేదలకు వద్దా..?! : ఎన్టీఆర్
ఎన్నికలను సజావుగా జరపండి : ఈసీ