ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కృష్ణంరాజు చూపు...ప్రజారాజ్యం వైపు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కృష్ణంరాజు చూపు...ప్రజారాజ్యం వైపు
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భాజపా నాయకుడు కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో తమకు మంచి సంబంధాలున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీలో చేరే ఉద్దేశం ఉన్నట్లు తెలియవచ్చింది.

ఇదిలావుండగా ప్రజారాజ్యం పార్టీ నరసాపురం నియోజకవర్గం సీటును పరకాల ప్రభాకర్‌కు కేటాయించడంపై ప్రస్తుతం ఆ సీటుపై చర్చనీయాంశమైందని ప్రజారాజ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

గత కొన్ని రోజులు క్రితం కృష్ణంరాజు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు రావడంతో వాటిని కృష్ణంరాజు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఖండించారు. కాగా ప్రస్తుతం ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరతారనే విషయంపై ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కారాగారం నుంచి కూర రాజన్న విడుదల
ఎన్నికల అధికారిని బెదిరించలేదు: రోశయ్య
త్రివేణి చెంతకు సుప్రీం కమిటీ బృందం
కలిసి బతకడం వారికి గిట్టడం లేదు: బాబు
ఆరోగ్యశ్రీకి గ్రీన్ సిగ్నల్: ఈసీ సుబ్బారావు
తెదేపా వస్తే సెజ్ భూములు వెనక్కి: జూ.ఎన్టీఆర్