ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పంచభూతాలను దోచుకున్న కాంగ్రెస్: తెదేపా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పంచభూతాలను దోచుకున్న కాంగ్రెస్: తెదేపా
గత ఐదేళ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పంచభూతాలను దోచుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ తాజాగా ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో కొత్తదనం ఏదీ లేదని తెదేపా నేతలైన రావుల చంద్రశేఖర రెడ్డి, వేణుగోపాలాచారి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై వారు మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల మౌలిక అవసరాలు తీర్చే అంశాలేవీ ఇందులో ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు.

వాగ్ధానాల పరంపర, హామీల వర్షం కురిపించారే గానీ, ప్రజలకు పనికొచ్చే అంశాలే లేవని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ళుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి మళ్లీ ఆ కార్యక్రమాలన్ని కొనసాగిస్తామంటున్నారని ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేసి పంచభూతాలను దోచుకున్నారని వారు విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ పార్టీ
పీఆర్పీ ఉమ్మడి గుర్తు కేసు 27కు వాయిదా
మహాకూటమిలోనే తెరాస: నారాయణ
ఇసుక కుంభకోణమే కొంప ముంచింది: గొల్లపల్లి
కెసీఆర్ ప్రకటనతో తెదేపా నేతలకు షాక్!
రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా: ముత్తా