ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > చంద్రబాబు కాళ్ల బేరం: మెట్టు దిగిన కేసీఆర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చంద్రబాబు కాళ్ల బేరం: మెట్టు దిగిన కేసీఆర్
కె.చంద్రశేఖర రావు హైడ్రామాకు తెరదించారు. బెదిరింపులు, డెడ్‌లైన్‌లకు స్వస్తి చెప్పి, ఒక మెట్టు దిగారు. మహాకూటమి అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి తన సపరివారంతో బయలుదేరారు. సీట్ల పంపిణీపై తుది నిర్ణయం తీసుకునేందుకు వారిద్దరు ఒకచోట భేటీ అవుతున్నారు. చంద్రబాబు స్వయంగా కాళ్ళబేరానికి వచ్చి, కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ తన బెట్టు సడలించినట్టు తెరాస శ్రేణులు వెల్లడించాయి.

మంగళవారం మధ్యాహ్నం 2.30 లోగా తమ డిమాండ్లపై చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణలోని అన్ని స్థానాల్లోనూ తెరాస అభ్యర్థులను పోటీ పెడతామంటూ కేసీఆర్ మంగళవారం ఉదయం అల్టిమేటమ్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ వెనువెంటనే తమ పార్టీ అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేయడంలో ఆయన నిమగ్నమయ్యారు.

దీంతో ఒక్కసారి ఖంగుతిన్న చంద్రబాబు ఆగమేఘాలపై కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తొందరపడి, తెరాస జాబితాను ప్రకటించవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన సి.ఎం.రమేష్‌, ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్ధన్ రెడ్డిని కేసీఆర్ నివాసానికి కాళ్ళ బేరానికి పంపించారు. వీరితో చర్చలు జరిపిన కేసీఆర్ ఆ వెనువెంటనే బయలుదేరి చంద్రబాబు నివాసానికి వెళ్ళారు.

చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేశారని, తనకు ఒక ఆఫర్ సంఖ్య చెప్పారని ఈ విషయమై తమ పార్టీ నాయకులు హరీష్ రావు, కె.రామారావు, ఈటెల రాజేందర్ చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారని కేసీఆర్ తన సన్నిహితులు వద్ద వెల్లడించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తెరాస సొంతగా పోటీ చేయడం వల్ల తెరాస, తెలుగుదేశం పార్టీలకు నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలు లాభపడతాయని చంద్రబాబుకు గుబులు పట్టుకుంది. ఈ సత్యాన్ని గ్రహించిన చంద్రబాబు, కేసీఆర్ చివరికి లాలూచీ పడక తప్పలేదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం: వైఎస్
పంచభూతాలను దోచుకున్న కాంగ్రెస్: తెదేపా
అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ పార్టీ
పీఆర్పీ ఉమ్మడి గుర్తు కేసు 27కు వాయిదా
మహాకూటమిలోనే తెరాస: నారాయణ
ఇసుక కుంభకోణమే కొంప ముంచింది: గొల్లపల్లి